ఛీ ఛీ.. అక్కడ కూడా కేసీఆర్ బొమ్మలేనా?

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: తెలంగాణ కోసం జీవితాంతం వ‌ర‌కు తపించి, స్వరాష్ట్రం కోసం కలలుగని ఆ కల నిజమయ్యేరోజు దాకా వేచి చూడకుండానే వెళ్లిపోయారు ప్రొఫెసర్ జయశంకర్ సార్. స్వరాష్ట్ర సాధన కోసం జీవితకాలం అలుపెరుగని అక్షరపోరు సాగించిన మ‌హాత్ముడు ఆయన. అయితే.. అంతటి మహాత్ముని స్మృతుల పేరిట త‌ల‌పెట్టిన జ‌యశంక్ సార్ స్మృతివ‌నంలో చేప‌డుతున్న అభివృద్ధి ప‌నులు అభాసుపాల‌వుతున్నాయి. ముఖ్యంగా సిమెంట్ గోడ‌పై ఏర్పాటు చేస్తున్న శిల్పాల నిర్మాణంలో ప్రముఖంగా క‌న‌బ‌డాల్సిన సార్ శిల్పాల‌ కంటే […]

Update: 2021-03-02 02:18 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: తెలంగాణ కోసం జీవితాంతం వ‌ర‌కు తపించి, స్వరాష్ట్రం కోసం కలలుగని ఆ కల నిజమయ్యేరోజు దాకా వేచి చూడకుండానే వెళ్లిపోయారు ప్రొఫెసర్ జయశంకర్ సార్. స్వరాష్ట్ర సాధన కోసం జీవితకాలం అలుపెరుగని అక్షరపోరు సాగించిన మ‌హాత్ముడు ఆయన. అయితే.. అంతటి మహాత్ముని స్మృతుల పేరిట త‌ల‌పెట్టిన జ‌యశంక్ సార్ స్మృతివ‌నంలో చేప‌డుతున్న అభివృద్ధి ప‌నులు అభాసుపాల‌వుతున్నాయి. ముఖ్యంగా సిమెంట్ గోడ‌పై ఏర్పాటు చేస్తున్న శిల్పాల నిర్మాణంలో ప్రముఖంగా క‌న‌బ‌డాల్సిన సార్ శిల్పాల‌ కంటే కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ బొమ్మలే ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీనిపై తెలంగాణ‌వాదులు, జ‌య‌శంక‌ర్‌సార్‌తో క‌లిసి ఉద్యమంలో అగ్రప‌థాన ప‌నిచేసిన నాయ‌కులు ప్రభుత్వ ప‌నితీరును ఈస‌డించుకుంటున్నారు. ఛీ ఛీ.. ఏంటీ దౌర్భగ్యం అంటూ మండిప‌డుతున్నారు. సార్ స్మృతివ‌నంలో కేటీఆర్ శిల్పాలు అవ‌స‌రమా? ఉద్యమం ప్రస్థానంలో కేటీఆర్ పాత్ర ఎంత‌? ఆయ‌న స్థాయి ఏంటి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

మేం కాదు.. డైరెక్షన్ అంతా అక్కడి నుంచే..

జయశంకర్‍ స్మృతివనం పనులు నాలుగేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభ‌మ‌య్యాయి. స్మృతి వ‌నంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌ కోసం రూ.3 కోట్ల పైచిలుకు నిధులను కేటాయించారు. మొదటిదశలో రూ.1.7 కోట్లు మంజూరు చేశారు. గ్రేటర్‍ కార్పొరేషన్‍తో పాటు కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీకి పనుల పర్యవేక్షణ అప్పజెప్పారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేసి సార్‍ పేరుతో ఉన్న పార్కును సుందరంగా మార్చనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప‌నులు ఏళ్లుగా కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే స్మృతివ‌నంలో ఏర్పాటు చేస్తున్న శిల్పాల‌పై కుడా, గ్రేట‌ర్‌ అధికారులు నోరు మెద‌ప‌డం లేదు. శిల్పాల ఏర్పాటు, స్మృతివ‌నంలో జ‌రుగుతున్న అన్నీ ప‌నులు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ప‌ర్యవేక్షిస్తున్నారంటూ చెబుతుండ‌టం విశేషం.

సార్ ఫొటోలు మూడంటే మూడే..!

స్మృతివ‌నం మొత్తంలో సార్‌ను తేజోవంతంగా చూపుతున్నవి కేవ‌లం మూడే క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. మిగ‌తావ‌న్నీ కూడా జ‌య‌శంక‌ర్ సార్ కేసీఆర్‌తో, కేటీఆర్ ఉద్యమ స‌మ‌యంలో ఉన్న నాటి ఘ‌ట్టాల‌ను ప్రతిభింబిస్తున్నాయి. చిత్రాల్లో జ‌య‌శంక‌ర్ సార్ క‌న్నా కేసీఆర్ కీలకంగా క‌నిపిస్తుండ‌టం విశేషం. రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ క‌న్నా ముందు నుంచి జ‌య‌శంక‌ర్‌ సార్ ఉంటూ వ‌స్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు దిక్సూచిలా వ్యవ‌హ‌రించిన జ‌య‌శంక‌ర్ సార్ ప్రతిష్టను వెలుగులోకి తీసుకువ‌స్తున్నట్లే చెబుతూ.. దిగ‌జార్చేందుకు క‌ల్వకుంట్ల కుటుంబం శ‌త‌విధాలా య‌త్నిస్తోంద‌న్న విమ‌ర్శలూ వినిపిస్తున్నాయి. జ‌య‌శంక‌ర్‌సార్ తెలంగాణ బాగు కోసం స్వరాష్ట్ర సాధ‌న‌కు అహ‌ర్నిశ‌లు కొట్లాడాడ‌ని.. జ‌య‌శంక‌ర్ సార్‌పై ఉన్న విశ్వస‌నీయ‌త‌తోనే కేసీఆర్‌కు నాయ‌కుడిగా ముందుకు న‌డ‌వ‌గ‌లిగార‌ని ఉద్యమ‌కారులు చెబుతున్నారు.

తెలంగాణ వ‌చ్చాకా కేసీఆర్ కుటుంబ స‌భ్యుల కోసం స్వరాష్ట్రంలో కొట్లాడుతున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో జన్మించి తుదిశ్వాస దాకా తెలంగాణనే కలగని 2011, జూన్‌ 21న కన్నుమూశారు. తన జీవితం మొత్తం తెలంగాణ వెనుకుబాటుతనాన్ని అధ్యయన శీలంతో అనుసరించీ ఆరాధించి తన చుట్టూ ఉన్నవాళ్లు ఆచరించేలా శాస్త్రీయతను రూపొందించారు. విద్యార్థి దశ నుంచి ఉపాధ్యాయుడిగా, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా, వైస్‌ చాన్స్‌లర్‌గా ఏ స్థాయిలో ఉన్నా తన కలను విడిచిపెట్టలేదు. అనేక‌మంది ప్రముఖుల‌తో ఆయ‌న క‌లిసి తెలంగాణ నినాదాన్ని వినిపించారు. తొలిద‌శ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క చిత్రం ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఇటీవల యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్‌ బొమ్మలు ఏర్పాటు చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరి దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News