ఉద్యోగ సంఘాలతో సీఎం సుదీర్ఘ సమావేశం…
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ మమత, కార్యదర్శులు ఏనుగుల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌తో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ మాజీ ఛైర్మన్ కారం రవీందర్‌రెడ్డి తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ మమత, కార్యదర్శులు ఏనుగుల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌తో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ మాజీ ఛైర్మన్ కారం రవీందర్‌రెడ్డి తదితరులు సీఎంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిట్‌మెంట్‌పై చర్చించిన సీఎం కేసీఆర్… దాదాపు 30 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుతున్నారు.
ప్రస్తుతం మండలి ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల నుంచి పీఆర్సీపైనే వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులు… ఉద్యోగ వర్గాల మద్దతు కూడబెట్టుతున్నా పీఆర్సీపై క్షేత్రస్థాయిలో వ్యతిరేక వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రులు కూడా సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసరంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులతో చర్చించేందుకు నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం ఉద్యోగ నేతలను ఆహ్వానించారు. సుమారు మూడు గంటల పాటు చర్చించారు. అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఉద్యోగ సంఘాలకు సీఎం కేసీఆర్ హామీ ఇదే… ఫిట్మెంట్ ఎంత పెంచనున్నారంటే..?