‘అది కాకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ ఇప్పుడు నరుక్కుంటారా..?’

దిశ  ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత, గిరిజనులకు ఓరిగిందేమి లేదని, ప్రాజెక్టులు, బడా కంపెనీల కొరకు రాష్ట్రంలో 70 వేల ఎకరాల దళిత, గిరిజన భూములను కేసీఆర్ సర్కారే లాక్కుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ […]

Update: 2021-08-07 02:11 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత, గిరిజనులకు ఓరిగిందేమి లేదని, ప్రాజెక్టులు, బడా కంపెనీల కొరకు రాష్ట్రంలో 70 వేల ఎకరాల దళిత, గిరిజన భూములను కేసీఆర్ సర్కారే లాక్కుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలన్నారు. కేసీఆర్ పార్టీ స్థాపించిన మొదలు అధికారంలోకి వచ్చే వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి అని లేకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ ఇప్పుడు నరుక్కుంటారా..? అని ప్రశ్నించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని కేసీఆర్ ను నిలదీయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగమన్న కేసీఆర్ హామీ అమలైతే ఇప్పటి వరకు సుమారు 70 వేల ఉద్యోగాలు కేవలం దళిత, గిరిజనులకు వచ్చేవని అన్నారు. దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని కానీ రాష్ట్రం మొత్తం దానిని అమలు చేయాలన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పంపిణీ చేసినవి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చన్నారు.

దళిత బంధును నిజామాబాద్ జిల్లాలో అమలు చేయాలని, 9 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎందుకు కేసీఆర్ ను అడుగుతలేరో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంద్రవెల్లిలో దళిత, గిరిజనుల ఆత్మగౌరవ సభలో కేసీఆర్ సర్కారు చేస్తున్న అన్యాయాల గురించి వివరించబోతున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశ వేణు, నాయకులు శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్, వేణురాజ్, రాజరాజనరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News