రైతుబంధుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. అందుకే ఖాతాల్లోకి డబ్బులు

దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు. రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాది అని సీఎం అన్నారు. రైతు మంచిగుంటేనే ఊరు సల్లగుంటదని కేసీఆర్ వెల్లడించారు. రైతులతో ఎంతో మందికి పనిదొరుకుతుంది. అన్నీ ఆలోచించే.. రైతులు నష్టపోవద్దన్న కారణంతోనే రైతు బంధు తెచ్చామని అన్నారు. అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నట్టు […]

Update: 2021-06-20 04:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు. రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాది అని సీఎం అన్నారు. రైతు మంచిగుంటేనే ఊరు సల్లగుంటదని కేసీఆర్ వెల్లడించారు. రైతులతో ఎంతో మందికి పనిదొరుకుతుంది.

అన్నీ ఆలోచించే.. రైతులు నష్టపోవద్దన్న కారణంతోనే రైతు బంధు తెచ్చామని అన్నారు. అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులకు మంచి జరుగుతుంటే కొందరికి నచ్చడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 95శాతం రైతుబంధు సద్వినియోగం అవుతోందని కేసీఆర్ అన్నారు. ధరణి కోసం మూడేళ్ల నుంచి శ్రమించామని వెల్లడించారు.

 

Tags:    

Similar News