జనం చస్తుంటే.. హుజూరాబాద్ రాజకీయాల్లో బిజీగా కేసీఆర్..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జనం కరోనాతో పిట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని.. ఇంతకంటే తుగ్లక్ పాలనా ఉంటుందా? అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జీ. వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేసి ఉంటే ఇప్పటిదాకా కరోనా బారిన పడిన వారిలో 80 శాతం మందికి లాభం జరిగేదన్నారు. 30 లక్షల మందికి పైగా ఉపయోగం ఉండే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జనం కరోనాతో పిట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని.. ఇంతకంటే తుగ్లక్ పాలనా ఉంటుందా? అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జీ. వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేసి ఉంటే ఇప్పటిదాకా కరోనా బారిన పడిన వారిలో 80 శాతం మందికి లాభం జరిగేదన్నారు. 30 లక్షల మందికి పైగా ఉపయోగం ఉండే స్కీంను ఎందుకు అమలు చేయట్లేదో ప్రజలకు వివరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2020 డిసెంబర్ 30 వరకు రాష్ట్రంలో అమలు చేస్తామని కేసీఆర్ సీఎస్‌తో ప్రధానికి చెప్పించారని.. అయినా నేటి వరకు ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేయడంలో మాట తప్పారన్నారు. కొవిడ్ ట్రీట్‌మెంట్ చేసుకున్న పేదలకు ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రీయింబర్స్‌మెంట్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఏడాది నుంచి కొవిడ్ చికిత్స కోసం అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్‌తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ.. ఇళ్లలోనే గరీబోళ్ల కోసం బీజేపీ దీక్షను విజయవంతం చేయాలని కోరారు.