రైతుకు పట్టిన చీడ కేసీఆర్ : జూలకంటి

దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో రైతులకు పట్టిన చీడ కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల కోసం ఎక్కడి దాకానైనా కొట్లాడుతానన్న కేసీఆర్.. రైతులపట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. చేనుకు చీడ పడితే ఏం చేయాలో తెలిసిన రైతులు, సరైన సమయంలో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూలకంటి మాట్లాడారు. వరి ధాన్యం చేతికొచ్చిన దశలో కల్లాల్లో కనీస వసతులు కల్పించలేదన్నారు. సకాలంలో లారీలు సమాకుర్చక […]

Update: 2021-11-28 07:49 GMT

దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో రైతులకు పట్టిన చీడ కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల కోసం ఎక్కడి దాకానైనా కొట్లాడుతానన్న కేసీఆర్.. రైతులపట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. చేనుకు చీడ పడితే ఏం చేయాలో తెలిసిన రైతులు, సరైన సమయంలో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూలకంటి మాట్లాడారు.

వరి ధాన్యం చేతికొచ్చిన దశలో కల్లాల్లో కనీస వసతులు కల్పించలేదన్నారు. సకాలంలో లారీలు సమాకుర్చక ఎగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, తక్షణమే ఇసుక రవాణా ఆపి వరి ధాన్యం మిల్లులకు తరలించాలని కోరారు. ఢిల్లీకి వెళ్లి తేల్చుకు వస్తానన్న కేసీఆర్, ఏం మాట్లాడక పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. యాసంగిలో రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఆరోపించారు.

Tags:    

Similar News