లక్షల టన్నుల ధాన్యం దళారుల పాలైంది: మహేష్ కుమార్ గౌడ్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ కుటుంబం వల్లనే రైతులు దోపిడీకి గురవుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబ మద్దతుతోనే దళారులు 1500 రూపాయలకే వడ్లు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకున్నారన్నారు. దీనిపై వచ్చే దాదాపు 1500 కోట్ల ఆదాయం ఎవరు పంచుకుంటారో ప్రభుత్వం లెక్కలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ […]

Update: 2021-12-23 06:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ కుటుంబం వల్లనే రైతులు దోపిడీకి గురవుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబ మద్దతుతోనే దళారులు 1500 రూపాయలకే వడ్లు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకున్నారన్నారు. దీనిపై వచ్చే దాదాపు 1500 కోట్ల ఆదాయం ఎవరు పంచుకుంటారో ప్రభుత్వం లెక్కలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. గత నెల రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ లు వడ్ల కొనుగోలు పై స్టేజి డ్రామా చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మెంబర్ షిప్ కోఆర్డినేటర్ ఆవెజ్, రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇంచార్జ్ తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్మర్తి గోపి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కి యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరెడ్డి భాగ్య తదితరులు పాల్గోన్నారు.

Tags:    

Similar News