టీఆర్ఎస్ బాస్‌గా ఆయనే.. గులాబీదళం అంతా అటు వైపే..!

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనమే అయింది. ఇప్పటివరకు వేసిన నామినేషన్లు అన్నీ కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వేసినవే కావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కాగా, పార్టీ అనుబంధ కమిటీలు నామినేషన్ వేశారు. అందులో కేసీఆర్‌పై ఉన్న అభిమానం చాటారు. ఆయన అధ్యక్షతే శ్రీరామరక్ష అంటూ నామినేషన్లు వేసి తమ భక్తిని చాటుకున్నారు. నేడు నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ, 25న […]

Update: 2021-10-22 19:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనమే అయింది. ఇప్పటివరకు వేసిన నామినేషన్లు అన్నీ కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వేసినవే కావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కాగా, పార్టీ అనుబంధ కమిటీలు నామినేషన్ వేశారు. అందులో కేసీఆర్‌పై ఉన్న అభిమానం చాటారు. ఆయన అధ్యక్షతే శ్రీరామరక్ష అంటూ నామినేషన్లు వేసి తమ భక్తిని చాటుకున్నారు. నేడు నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ, 25న అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.

నాలుగేళ్లకోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక అవుతూ వస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువగా టీఆర్ఎస్ అనుబంధ కమిటీ సభ్యులు నామినేషన్లు వేశారు. అందులో అన్ని కూడా అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వేసినవే. ఒక్కరూ కూడా నామినేషన్ వేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి మంత్రి మహమూద్ అలీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరు ప్రతిపాదించగా మంత్రులు ఆమోదించారు. నామినేషన్ సెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అదే విధంగా ఎంపీల నుంచి రాజ్యసభ సభ్యుడు కేకే అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ప్రతిపాదించగా ఎంపీలు ఆమోదించారు.

ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గాదరి కిశోర్ వేర్వేరుగా రెండు సెట్లను కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వేశారు. ఎమ్మెల్సీల నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జెడ్పీటీసీల నుంచి విజయకుమార్, టీఆర్ఎస్ మహిళా కమిటీ నుంచి ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, రాష్ట్ర మేయర్ల తరుపున గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ విప్ ల నుంచి విప్ దాస్యం వినయభాస్కర్, డీసీసీబీ మరియు డీసీఎంఎస్ కమిటీల నుంచి కొండూరి రవీందర్ రావు, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నుంచి ఎంకే ముజీబొద్దీన్, ఎన్ఆర్ఐల విభాగం నుంచి మహేబ్ బిగాల, రాష్ట్ర కార్పొరేషన్ల నుంచి గ్యాదరి బాలమల్లు, జడ్పీ చైర్మన్ల నుంచి నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రైతుసంఘాల నుంచి రాంబాబు, రైతుబంధు సమితి నుంచి నాగిరెడ్డి, ఎస్టీసెల్ నుంచి రూప్ సింగ్‌లు కేసీఆర్‌ను అధ్యక్షుడిగా నామినేషన్ సెట్ అందజేశారు. ఈ నామినేషన్లు అన్నీ కూడా కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వేసినవే. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక లాంఛన ప్రాయమైంది.

భక్తిని చాటుకునేందుకే..

టీఆర్ఎస్ అనుంబంధ సంఘాల నుంచి నాయకులు పోటీపడి నామినేషన్లు వేశారు. అయితే, ఈ నామినేషన్లు అన్నీ కూడా కేసీఆర్‌మీద ఉన్న భక్తిని చాటుకునేందుకే అని స్పష్టమవుతోంది. ఎన్నిక అంటే ఎవరైనా వేయవచ్చు. పోటీలో ఉంటామని స్వతహాగా వేస్తుంటారు. కానీ, టీఆర్ఎస్‌లో అంతా రివర్స్ జరిగింది. 18 నామినేషన్లు వేస్తే అందులో అన్ని కూడా కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వేసినవే. అయితే మరి ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు.. నామినేషన్ల స్వీకరణ ఎందుకు అని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం కేసీఆర్‌పై భక్తిని చాటుకునేందుకేనని స్పష్టమవుతుంది. ఈనెల 25న హైటెక్స్‌లో నిర్వహించే ఫ్లీనరీలో అధ్యక్షుడిగా కేసీఆర్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News