‘కవన మంజరి’ పుస్తకావిష్కరణ
దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతనగర కవుల వేదిక లాల్ దర్వాజాకు చెందిన మంజుల సూర్య ప్రచురించిన ‘కవన మంజరి’ పుస్తకాన్ని శుక్రవారం తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి యువ కవయిత్రిలే ఈనాటి సమాజ యువతకు ఎంతో అదర్శం అన్నారు. కవిత్వం ఓ చిన్న పాపలాంటిదని, కవి మాత్రమే తన ప్రేమతో కవిత్వాన్ని లాలించగలగాలని, పాలించగలగాలన్నారు. ఒక్కొసారి బ్రతిమాలాలి… ఇలా ఎన్ని చేసినా ప్రేమను మాత్రం […]
దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతనగర కవుల వేదిక లాల్ దర్వాజాకు చెందిన మంజుల సూర్య ప్రచురించిన ‘కవన మంజరి’ పుస్తకాన్ని శుక్రవారం తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి యువ కవయిత్రిలే ఈనాటి సమాజ యువతకు ఎంతో అదర్శం అన్నారు. కవిత్వం ఓ చిన్న పాపలాంటిదని, కవి మాత్రమే తన ప్రేమతో కవిత్వాన్ని లాలించగలగాలని, పాలించగలగాలన్నారు. ఒక్కొసారి బ్రతిమాలాలి… ఇలా ఎన్ని చేసినా ప్రేమను మాత్రం అన్నింటికీ కామన్ గా కొనసాగించినప్పుడే కవిత్వం కవి వశమై, కవి ఒడిలోకి చేరుతుందన్నారు.
అలా ఒడిలోకి చేరి ఒద్దికగా కూర్చున్న కవిత్వాన్ని మన ముందు ‘కవన మంజరి’గా ఆవిష్కరించిన కవయిత్రి మంజుల సూర్య అని కొనియాడారు. రచయిత్రి మంజుల సూర్య మాట్లాడుతూ కవన మంజరి కవిత సంపుటిలో దాదాపు 80 కవితలను రాయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ కు ప్రథమ కాపీని హరనాథ్ అందించారు. ఇంకా ఈ ఆవిష్కరణలో హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కార్యదర్శి కొరుప్రోలు హరనాథ్, సత్యం న్యూస్ చీఫ్ ఎడిటర్ సత్యమూర్తి పులిపాక, రాంఖీ తదితరులు పాల్గొన్నారు.