ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
దిశ, మెదక్ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌడిపల్లి ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధికి చెందిన యువతి (19 ) వివాహం జరిగిన ఏడాదిలోపే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయ్యే బాజా నర్సింహులు ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చగా పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. […]
దిశ, మెదక్ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌడిపల్లి ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధికి చెందిన యువతి (19 ) వివాహం జరిగిన ఏడాదిలోపే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయ్యే బాజా నర్సింహులు ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చగా పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. తనకేమి సంబంధం లేదని అతను మాటమార్చాడు. మోసపోయినట్లు గ్రహించిన యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు నర్సింహులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Tags: Medak,police,case file