కత్రినా – విక్కీల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. త్వరలో పెళ్లి?

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌.. తమ సీక్రెట్ రిలేషన్‌షిప్‌ గురించి ఇప్పటికీ పెదవి విప్పలేదు. కానీ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ కావడం, వెకేషన్స్‌కు వెళ్తుండటంతో ఇద్దరి మధ్యన ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ అంటూ బాలీవుడ్ మీడియా కొన్నాళ్లుగా కోడై కూస్తోంది. కాగా ఈ బీటౌన్ హాట్ కపుల్.. తమ రిలేషన్‌‌షిప్‌ను మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కత్రినా, విక్కీల ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగిందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే రోకా […]

Update: 2021-08-18 03:01 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌.. తమ సీక్రెట్ రిలేషన్‌షిప్‌ గురించి ఇప్పటికీ పెదవి విప్పలేదు. కానీ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ కావడం, వెకేషన్స్‌కు వెళ్తుండటంతో ఇద్దరి మధ్యన ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ అంటూ బాలీవుడ్ మీడియా కొన్నాళ్లుగా కోడై కూస్తోంది. కాగా ఈ బీటౌన్ హాట్ కపుల్.. తమ రిలేషన్‌‌షిప్‌ను మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కత్రినా, విక్కీల ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగిందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే రోకా ఫంక్షన్ ఉండబోతోందని తెలుస్తుండగా.. దీనిపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగానే ఉన్నారు కదా.. ఇదెప్పుడు జరిగిందంటున్న అభిమానులు.. ఒకవేళ ఇది నిజమైతే ఆనందంతో చనిపోతామేమో అంటున్నారు. ఇప్పుడు సల్మాన్ భాయ్, కత్రినా -విక్కీల మ్యారేజ్ లొకేషన్ తెలుసుకోవడంలో బిజీ అయిపోయాడేమో.. అని కామెంట్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.

Tags:    

Similar News