మాక్సివిజన్‌ను సందర్శించిన కాట్రిన్

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి కాట్రిన్ కివి సందర్శించారు. కంటి పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల చికిత్సలను పరిశీలించేందుకు ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ కండిషన్‌లో ఉన్న రోగులకు కంటి చికిత్సలు చేసేందుకు అల్ట్రా సిస్టంను ఎలా వినియోగిస్తున్నారో డాక్టర్లు ఆమెకు వివరించారు. కంటి పరీక్షలు చేయించుకున్న అనంతరం కాట్రిన్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ టెక్నాలజీతో కంటి చికిత్సలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యంత విలువైన […]

Update: 2021-03-05 07:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా రాయబారి కాట్రిన్ కివి సందర్శించారు. కంటి పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల చికిత్సలను పరిశీలించేందుకు ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ కండిషన్‌లో ఉన్న రోగులకు కంటి చికిత్సలు చేసేందుకు అల్ట్రా సిస్టంను ఎలా వినియోగిస్తున్నారో డాక్టర్లు ఆమెకు వివరించారు.

కంటి పరీక్షలు చేయించుకున్న అనంతరం కాట్రిన్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ టెక్నాలజీతో కంటి చికిత్సలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యంత విలువైన కళ్లకు వైద్యులు ఎంతో జాగ్రత్తతో చికిత్సలు చేయాల్సిన అవసరముందన్నారు. దేశంలోని ఆరు నగరాల్లో 14 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రత్యేకమైన కంటి చికిత్సలు అందిస్తున్నామని ఆసుపత్రి సిబ్బంది ఆమెకు తెలిపారు.

 

Tags:    

Similar News