కస్నతండాను కమ్మేసిన కటిక చీకటి..

దిశ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామ శివారు కస్నతండాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత ఐదు రోజులుగా తండా వాసులు కటిక చీకటిలో గడుపుతున్నారు.తండాలో 25 కుటుంబాలకు 15 కేవీ ట్రాన్స్ ఫార్మర్‌తో విద్యుత్ సరఫరా అయ్యేది. గత నెల 26న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో దాని స్థానంలో విద్యుత్ శాఖ అధికారులు 10 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చి చేతులు దులుపుకున్నారు. తక్కువ కేవీ ట్రాన్స్ ఫార్మర్ కావడంతో ఓవర్ లోడ్ […]

Update: 2021-10-01 04:47 GMT

దిశ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామ శివారు కస్నతండాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత ఐదు రోజులుగా తండా వాసులు కటిక చీకటిలో గడుపుతున్నారు.తండాలో 25 కుటుంబాలకు 15 కేవీ ట్రాన్స్ ఫార్మర్‌తో విద్యుత్ సరఫరా అయ్యేది. గత నెల 26న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో దాని స్థానంలో విద్యుత్ శాఖ అధికారులు 10 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చి చేతులు దులుపుకున్నారు. తక్కువ కేవీ ట్రాన్స్ ఫార్మర్ కావడంతో ఓవర్ లోడ్ పడి మళ్లీ కాలిపోవడంతో తండా అంధకారంలోకి వెళ్లింది. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయగా స్పందించడం లేదని ఆవేదన తండా వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దత్తత తీసుకున్న గ్రామం కావడం గమనార్హం. ఐదు రోజులుగా తండా వాసులు అంధకారంలో ఉండటం పట్ల ప్రజల్లో ఒకింత చర్చ జరుగుతోంది.

కొత్త ట్రాన్స్‌ ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి : బొనోత్ మురళి

ఐదు రోజులుగా తండాలో కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం. సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిపోగా, రాత్రిపూట పిల్లలకు నిద్రలేక నానా అవస్థలు పడుతున్నాం. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలి.

Tags:    

Similar News