ఆ రోజు వ్యాక్సిన్ తీసుకుంటే.. వాషింగ్ మెషిన్, గ్రైండర్, గిఫ్ట్స్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా.?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రభుత్వాలు, వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టీకా వేసుకుంటే కొన్ని చోట్ల కొందరు వ్యక్తులు ప్రోత్సాహకాలు అందించారు. తాజాగా తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం కూడా ఈ తరహా చర్యలకే సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో టీకా తీసుకునే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్ మెషిన్, […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రభుత్వాలు, వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టీకా వేసుకుంటే కొన్ని చోట్ల కొందరు వ్యక్తులు ప్రోత్సాహకాలు అందించారు.
తాజాగా తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం కూడా ఈ తరహా చర్యలకే సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో టీకా తీసుకునే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను అందజేయనున్నట్టు కరూర్ జిల్లా కలెక్టర్ టి. ప్రభు శంకర్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్‌మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందజేస్తామన్నారు. 24 ప్రెజర్ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే టీకా కేంద్రాలకు లబ్ధిదారుల్ని తీసుకురావడంలో స్వచ్ఛందంగా పనిచేసేవారికి రూ.5 ప్రోత్సాహకం, 25 మంది కంటే ఎక్కువ మందిని తీసుకువచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరూర్ జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు.