మొక్కల సంరక్షణ బాధ్యత నాదే : కార్తికేయ
యంగ్ హీరో కార్తికేయ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ స్వీకరించాడు. విశ్వక్‌సేన్ నుంచి నామినేషన్ స్వీకరించిన ఆయన.. మూడు మొక్కలను నాటాడు. మొక్కలతో ఈ కుర్ర హీరో దిగిన సెల్ఫీలు ఇప్పటికే వైరల్ కాగా.. ఆ మొక్కల సంరక్షణకు పూర్తి బాధ్యత కూడా నాదే అని అతడు తెలపడం విశేషం. ఈ చాలెంజ్‌ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పిన కార్తికేయ.. ప్రతి ఒక్కరినీ ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశాడు. ‘మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం’ […]
యంగ్ హీరో కార్తికేయ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ స్వీకరించాడు. విశ్వక్‌సేన్ నుంచి నామినేషన్ స్వీకరించిన ఆయన.. మూడు మొక్కలను నాటాడు. మొక్కలతో ఈ కుర్ర హీరో దిగిన సెల్ఫీలు ఇప్పటికే వైరల్ కాగా.. ఆ మొక్కల సంరక్షణకు పూర్తి బాధ్యత కూడా నాదే అని అతడు తెలపడం విశేషం. ఈ చాలెంజ్‌ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పిన కార్తికేయ.. ప్రతి ఒక్కరినీ ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశాడు. ‘మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చాడు.
ఆర్‌ఎక్స్ 100 తర్వాత అంత పెద్ద హిట్ అందుకోలేని కార్తికేయ.. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘చావు కబురు చల్లగా’ సినిమా చేస్తున్న ఈ హీరో.. బస్తీ బాలరాజుగా ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. కౌశిక్ పెగాల్లపటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాత కాగా, జాక్స్ బెజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.