యాదాద్రి లో భక్తి, శ్రద్దలతో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

దిశ. యాదగిరిగుట్ట : కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు యాదాద్రికి అధిక సంఖ్యలో తరలిరావడంతో నరసింహుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పడుతోంది. కార్తీక పౌర్ణమి కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన జరిపించడం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద పాత గోశాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుని మొక్కులు చెల్లించుకున్నారు. […]

Update: 2021-11-19 01:14 GMT

దిశ. యాదగిరిగుట్ట : కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు యాదాద్రికి అధిక సంఖ్యలో తరలిరావడంతో నరసింహుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పడుతోంది. కార్తీక పౌర్ణమి కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన జరిపించడం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

కొండ కింద పాత గోశాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన స్వామి వారి సన్నిధి వద్ద కార్తీక దీపారాధన చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఉదయం గం.6.30 నుంచి నరసింహుడి క్షేత్రం కిటకిటలాడింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు సాయంత్రం గం.4:30 వరకు ఎనిమిది బ్యాచుల వారీగా నిర్విరామంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన ఘనంగా చేసుకుంటున్నారు.

Tags:    

Similar News