కత్తి కార్తీకతో ‘నోటా’ పోటాపోటీ
దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం 1,62,516 ఓట్లను లెక్కించగా.. 620 ఓట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం 1,62,516 ఓట్లను లెక్కించగా.. 620 ఓట్లు పొందారు. ఇదిలా ఉంటే నోటాకు 552 ఓట్లు వచ్చాయి.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని.. అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.