రూ. 1,600 కోట్ల సాయాన్ని ప్రకటించిన కర్ణాటక
బెంగళూరు: లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న కన్నడిగులకు కర్ణాటక ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 1,600 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకునేందుకు ముందడుగు వేసింది. ఈ ప్యాకేజీతో రైతులు, నేత కార్మికులు, ధోబీలు, బార్బర్‌లు, ఆటో.. ట్యాక్సీ డ్రైవర్‌లు సహా పలువురు లబ్ది పొందనున్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకూ సాయం అందనుంది. పూల తోటలు సాగుచేసేవారికి పంట నష్టానికి హెక్టార్‌కు రూ. 25వేల సహాయం, కాగా, ధోబీలు, క్షౌరవృత్తిదారులకు రూ. 5,000, ఆటో, ట్యాక్సీ […]
బెంగళూరు: లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న కన్నడిగులకు కర్ణాటక ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 1,600 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకునేందుకు ముందడుగు వేసింది. ఈ ప్యాకేజీతో రైతులు, నేత కార్మికులు, ధోబీలు, బార్బర్‌లు, ఆటో.. ట్యాక్సీ డ్రైవర్‌లు సహా పలువురు లబ్ది పొందనున్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకూ సాయం అందనుంది. పూల తోటలు సాగుచేసేవారికి పంట నష్టానికి హెక్టార్‌కు రూ. 25వేల సహాయం, కాగా, ధోబీలు, క్షౌరవృత్తిదారులకు రూ. 5,000, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 5,000, నిర్మాణ కార్మికులకు రూ. 3,000ల సహాయాన్ని అందించనుంది. నేత కార్మికులకు రూ. 2,000లను ఖాతాలో వేయనుంది. కొవిడ్ 19 కేవలం రైతులనే కాదు.. వృత్తిదారులూ దారుణంగా నష్టపోయారని సీఎం బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. అందుకే ఒక్కసారి సాయంగా రూ. 5,000లను 60వేల మంది ధోబీలకు, 2,30,000 మంది క్షౌరవృత్తిదారులకు అందించేందుకు నిర్ణయించినట్టు వివరించారు.
tags: coronavirus, lockdown, karnataka, relief package