చేతులు జోడించి కోరుతున్నా.. కరోనా కంట్రోల్ తప్పింది.. సీఎం సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో కరోనా పరిస్థితులు చేయి దాటిపోయాయని, దాన్ని నియంత్రించలేని స్థితికి చేరుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన మాట్లాడుతూ.. కరోనాను అదుపులోకి తెచ్చే దశను దాటిపోయామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురికి కరోనా సోకిందని చెప్పారు. దీనికి పరిష్కారం మాస్కులు ధరించడం, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడమేనని ప్రధానమంత్రి చెబుతున్నారని గుర్తుచేశారు. ఈ జాగ్రత్తలనూ ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. […]
బెంగళూరు: కర్ణాటకలో కరోనా పరిస్థితులు చేయి దాటిపోయాయని, దాన్ని నియంత్రించలేని స్థితికి చేరుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన మాట్లాడుతూ.. కరోనాను అదుపులోకి తెచ్చే దశను దాటిపోయామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురికి కరోనా సోకిందని చెప్పారు. దీనికి పరిష్కారం మాస్కులు ధరించడం, చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడమేనని ప్రధానమంత్రి చెబుతున్నారని గుర్తుచేశారు. ఈ జాగ్రత్తలనూ ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి అడుగు బయటపెట్టొద్దని ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తు్న్నాని తెలిపారు. పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయని ఆందోళన చెందారు. కరోనాను నియంత్రించలేని దశకు చేరుకున్నామని వివరించారు.