ఒకరోజు చనిపోతే.. మరోరోజు మృతిచెందినట్లు రాసిచ్చారు

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా వ్యాధితో మరణించిన ఓ వ్యక్తి చనిపోయిన రోజు కుటుంబ సభ్యులకు అదే రోజు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వర్గాలు. కానీ, అతను చనిపోయింది మాత్రం మరో రోజున అని ఓ లేఖ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్ష్మణాలతో మరణించాడు. అదేరోజు కరీంనగర్ సివిల్ ఆసుపత్రి సిబ్బంది మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి […]

Update: 2020-07-28 03:20 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా వ్యాధితో మరణించిన ఓ వ్యక్తి చనిపోయిన రోజు కుటుంబ సభ్యులకు అదే రోజు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వర్గాలు. కానీ, అతను చనిపోయింది మాత్రం మరో రోజున అని ఓ లేఖ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్ష్మణాలతో మరణించాడు. అదేరోజు కరీంనగర్ సివిల్ ఆసుపత్రి సిబ్బంది మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వారి కుటుంబ సభ్యులు మరునాడు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. కానీ, గ్రామస్తులు ససేమిరా అనడంతో మునిసిపల్ సిబ్బంది సాయంతో కరీంనగర్ లోనే ఖననం చేశారు. అయితే కరీంనగర్ సర్కారు దవాఖాన సిబ్బంది మాత్రం ఈ నెల 21న చనిపోయిన సదరు వ్యక్తిని 22న చనిపోయినట్టు ఓపీ చీటిపై రాసివ్వడం గమనార్హం.

కోవిడ్ డిపార్ట్ మెంట్ వార్డుల్లో ఏం జరుగుతుందో అర్థమవడంలేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కూడా ఆసుపత్రి యంత్రాంగం మాత్రం తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని మరోసారి రుజువైంది. కరోనా వ్యాధి సోకితే తమ ప్రాణాలకే ప్రమాదం ఉందన్న భయంతో కరోనా వార్డును సందర్శించే వారే లేకుండా పోవడంతో ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గర్షకుర్తికి చెందిన సదరు వ్యక్తి ఈ నెల 21న చనిపోగా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలని అతని మనుమడు కూడా గ్రామపంచాయితీకి రాశారు. కానీ, ఆసుపత్రి వైద్యులు మాత్రం 22న చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది.

Tags:    

Similar News