కరీనా ప్రెగ్నెన్సీ బైబిల్‌పై మైనారిటీల అభ్యంతరం

దిశ, సినిమా : బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ముఖ్యాంశంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, పిల్లలు.. ఇలా ప్రతీ విషయంలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేయడంలో ముందుంటుంది. కాగా తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా.. రెండు ప్రెగ్నెన్సీ టైమింగ్స్‌లో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓ పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ‘ కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో బుక్ రిలీజ్ కాగా.. వన్ ఆఫ్ […]

Update: 2021-07-14 08:30 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ముఖ్యాంశంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, పిల్లలు.. ఇలా ప్రతీ విషయంలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేయడంలో ముందుంటుంది. కాగా తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చిన కరీనా.. రెండు ప్రెగ్నెన్సీ టైమింగ్స్‌లో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓ పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ‘ కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో బుక్ రిలీజ్ కాగా.. వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

అయితే ప్రస్తుతం ఈ బుక్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ‘ది ఆల్ ఇండియా మైనార్టీ బోర్డ్’ పుస్తకం పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ విషయంపై బోర్డు చైర్ పర్సన్ డైమండ్ యూసఫ్‌తో పాటు పలువురు సభ్యులు కాన్పూర్‌లోని చున్నీ గంజ్ ప్రాంతంలో సమావేశమైనట్లు తెలుస్తోంది. కరీనాకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసేందుకు లీగల్ అడ్వైజ్ తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News