"అందుకే ఉత్తరాంధ్ర అంటే పవన్‌‌కు ద్వేషం"

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వల్లే ఉత్తరాంధ్ర అంటే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కు ద్వేషమని వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. గాజువాక వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని అన్నారు. అసలాయన పార్టీ ఎందుకు పెట్టారో తెలియని స్థితిలో ఉన్నారని విమర్శించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తే మీకేంటి బాధ? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ప్రజలు ఛీదరించారని ద్వేషం పెంచుకున్నారని, […]

Update: 2020-07-24 21:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వల్లే ఉత్తరాంధ్ర అంటే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కు ద్వేషమని వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. గాజువాక వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని అన్నారు. అసలాయన పార్టీ ఎందుకు పెట్టారో తెలియని స్థితిలో ఉన్నారని విమర్శించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తే మీకేంటి బాధ? అని ఆయన ప్రశ్నించారు.

విశాఖ ప్రజలు ఛీదరించారని ద్వేషం పెంచుకున్నారని, అందుకే ఆ ప్రాంతం అభివృద్ధి కాకుండా అడ్డుపుల్ల వేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ పెట్టి ఆరు నెలలకోసారి ఒక ప్రశ్న వేసి తర్వాత కనిపించని పవన్‌ మూడు రాజధానులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. భూస్థాపితం అయిన పార్టీల నేతలు ఉనికి కోసం చేసే వ్యాఖ్యలు పట్టించుకోనక్కర్లేదని అన్నారు.

Tags:    

Similar News