కోహ్లీ చేసిన రచ్చ చాలు.. కపిల్‌దేవ్ సీరియస్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాలో కెప్టెన్సీ వివాదం పీక్స్‌కు చేరింది. కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ, కోహ్లీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. విరాట్ వ్యాఖ్యలు పెను దుమారమే సృష్టించాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కెప్టెన్సీని నిర్ణయించే […]
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాలో కెప్టెన్సీ వివాదం పీక్స్‌కు చేరింది. కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ, కోహ్లీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. విరాట్ వ్యాఖ్యలు పెను దుమారమే సృష్టించాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. కెప్టెన్సీని నిర్ణయించే సంపూర్ణ అధికారం సెలెక్టర్లకు ఉంటుందని కపిల్ అన్నారు. కోహ్లీ ఆడినంతగా క్రికెట్.. సెలెక్టర్లు ఆడి ఉండకపోవచ్చు.. కానీ, కెప్టెన్సీకి సంబంధించి ఫైనల్ నిర్ణయం సెలెక్టర్లదే అని కపిల్ కుండబద్దలుకొట్టారు. వారి నిర్ణయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయం కోహ్లీకే కాకుండా అందరు ఆటగాళ్లకు వర్తిస్తుందన్నారు. కెప్టెన్సీ వివాదానికి కోహ్లీ ముగింపు పలకాలని, దక్షిణాఫ్రికా టూర్‌పై దృష్టి సారించాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.