మరింత ప్రాక్టీస్ అవసరం : కపిల్
పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఈ మధ్య పరుగులు రావడం లేదు. ఎప్పుడూ తన అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు వెన్నెముకలో నిలిచే కోహ్లీ వరుస వైఫల్యాలు.. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకునేలా చేశాయి. వ్యక్తిగతంగా కోహ్లీ తన ర్యాంక్‌ను కూడా కోల్పోయాడు. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అగ్రస్థానానికి ఎసరు వచ్చింది. ఈ నేపథ్యంలో కోహ్లీపై మాజీలు విమర్శలు ఎక్కుపెట్టారు. భారత జట్టు మాజీ […]
పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఈ మధ్య పరుగులు రావడం లేదు. ఎప్పుడూ తన అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు వెన్నెముకలో నిలిచే కోహ్లీ వరుస వైఫల్యాలు.. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకునేలా చేశాయి. వ్యక్తిగతంగా కోహ్లీ తన ర్యాంక్‌ను కూడా కోల్పోయాడు. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అగ్రస్థానానికి ఎసరు వచ్చింది. ఈ నేపథ్యంలో కోహ్లీపై మాజీలు విమర్శలు ఎక్కుపెట్టారు.
భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ సలహా మండలి సభ్యుడైన కపిల్ దేవ్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు గుప్పించాడు. అత్యంత చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడంపై కపిల్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒకే తీరున ఔటవడంపై కపిల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోహ్లీ బంతిని అంచనా వేసే తీరును మర్చిపోయాడని..కంటికి, బ్యాటుకు మధ్య అనుసంధానం కుదరట్లేదని చెప్పాడు.
కోహ్లీ తన ఫామ్‌ను తిరిగి పొందాలంటే నెట్స్‌లో మరింతగా ప్రాక్టీస్ చేయాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. 30 ఏండ్లు దాటిన తర్వాత అందరికీ దృష్టిలోపం తలెత్తడం సహజమని.. దీన్ని అధిగమించాలంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయడమే మంచిదని కపిల్ అన్నాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో పదేపదే అవుటవుతున్నాడంటే.. కోహ్లీ ఎక్కడో భయపడుతున్నాడనే అర్థమన్నాడు. ఐపీఎల్ కంటే ముందు కోహ్లీ తన ప్రాక్టీస్‌పై దృష్టిపెడితే మంచిదని కపిల్ చెప్పాడు.