అమరవీరులకు కంగనా స్వరాంజలి
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 23 భారతీయ చరిత్రలో చీకటి రోజు.. భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందించేందుకు చిన్న వయస్సులోనే తమ ప్రాణాలను అర్పించిన భారతమాత ముద్దుబిడ్డలు అమరులైన రోజు. విప్లవ మూర్తులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ థాపర్లు ఉరిని ముద్దాడిన రోజు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ… తన పాటతో అంజలి ఘటించింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. అమరుల త్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని తెలిపింది. Dear friends Kangana […]
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 23 భారతీయ చరిత్రలో చీకటి రోజు.. భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందించేందుకు చిన్న వయస్సులోనే తమ ప్రాణాలను అర్పించిన భారతమాత ముద్దుబిడ్డలు అమరులైన రోజు. విప్లవ మూర్తులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ థాపర్లు ఉరిని ముద్దాడిన రోజు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ… తన పాటతో అంజలి ఘటించింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. అమరుల త్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని తెలిపింది.
Dear friends Kangana thanking you all for wishing her on her Birthday also she sang few lines for our Martyrs, Jai Hind 🙏 pic.twitter.com/g1Ur65QLCE
— Rangoli Chandel (@Rangoli_A) March 23, 2020
కాగా మార్చి 23 కంగనా పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండియన్ సినిమా చరిత్రలో కంగానా బెంచ్ మార్క్ సెట్ చేయాలని… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్వీన్‌గా ఎదగాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని… ఇతరులకు స్ఫూర్తి ప్రదాతగా ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా.. సినీ రంగానికి చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీతో సత్కరించబడ్డారు.
కాగా కంగనా బర్త్ డే సందర్భంగా ఇంట్లో చేసిన పూజా విధానాన్ని వివరిస్తూ ఫోటోస్ షేర్ చేసింది సోదరి రంగోలి. ముందుగా దుర్గమాతను పూజించిన తర్వాత జన్మదిన పూజ, కన్య పూజ, నవగ్రహ పూజలు నిర్వహించినట్లు తెలిపింది. కంగనా జన్మదినం సందర్భంగా అమ్మ చేసిన పిండివంటలను కూడా షేర్ చేసింది.
Tags : Kangana Ranaut, BirthDay, Bollywood, Queen