బాలీవుడ్‌ను కడిగేసిన కంగనా..

ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగిన కంగనా రనౌత్ చాలా ముక్కు సూటి మనిషి. తను చెప్పాలనుకున్న ఏ విషయాన్నయినా ముఖం మీదే చెప్పేయడం తనకు అలవాటు. తప్పుందని తెలిస్తే ఎంత పెద్ద సెలబ్రిటీని అయినా వ్యతిరేకించగలదు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో చాలా సార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కరణ్ జోహార్, మహేష్ భట్, అమీర్ ఖాన్‌ లాంటి వారిని సైతం తన సినిమా ప్రమోషన్లకు అటెండ్ కాలేదని విమర్శించిన కంగనా.. తాజాగా బాలీవుడ్ […]

Update: 2020-06-06 04:27 GMT

ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగిన కంగనా రనౌత్ చాలా ముక్కు సూటి మనిషి. తను చెప్పాలనుకున్న ఏ విషయాన్నయినా ముఖం మీదే చెప్పేయడం తనకు అలవాటు. తప్పుందని తెలిస్తే ఎంత పెద్ద సెలబ్రిటీని అయినా వ్యతిరేకించగలదు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో చాలా సార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కరణ్ జోహార్, మహేష్ భట్, అమీర్ ఖాన్‌ లాంటి వారిని సైతం తన సినిమా ప్రమోషన్లకు అటెండ్ కాలేదని విమర్శించిన కంగనా.. తాజాగా బాలీవుడ్ మొత్తాన్ని కడిగిపారేసింది.

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి ఆందోళనలు జరుగుతుండగా.. బ్లాక్ లివ్స్ మ్యాటర్, ఆల్ లివ్స్ మ్యాటర్ హాష్ ట్యాగ్‌లతో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఈ నిరసనలకు మద్దతు తెలిపారు. ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అలియా భట్, పరిణీతి చోప్రా, దీపికా పదుకొనె ఇలా చాలా మంది సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెట్టారు. దీనిపై స్పందించిన కంగనా.. ఎక్కడో జరుగుతున్న విషయాలపై స్పందించడం బాలీవుడ్ తారలకు ఫ్యాషన్ అయిపోయిందని మండిపడింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో అమెరికా సోషియో పొలిటికల్ రీఫామ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న వీరు.. దేశం(మహారాష్ట్ర)లో ఇద్దరు సాధువులు హత్య చేయబడినప్పుడు ఎక్కడ పోయారని ప్రశ్నించింది. అప్పుడు వీరి నుంచి కనీసం ఒక్క పదం కూడా వినిపించక పోవడానికి కారణమేంటని అడిగింది. అంటే ‘మెజారిటీ ఎక్కువ ఉందనే స్టేటస్‌లు పెడుతున్నారు తప్ప.. తప్పును తప్పని చెప్పే దమ్ము వీరికి లేదా’ అని కడిగేసింది కంగనా.

Tags:    

Similar News