ఇకనైనా న్యాయం జరుగుతుంది : కంగనా

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కౌశ్యారిని కలిశారు. తన సోదరి రంగోలితో కలిసి గవర్నర్‌తో భేటీ అయిన కంగనా.. తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేయడంపై ఫిర్యాదు చేసింది. అలాగే తనపై ఇటీవల శివసేన నేతలు చేస్తున్న కామెంట్లు, అనంతరం జరిగిన పరిణామాలు, ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. కాగా, గవర్నర్‌ను కలిసిన అనంతరం ఇకనైనా తనకు న్యాయం జరుగుతుందని కంగనా అభిప్రాయపడింది. బాలీవుడ్ ఫైర్ […]

Update: 2020-09-13 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కౌశ్యారిని కలిశారు. తన సోదరి రంగోలితో కలిసి గవర్నర్‌తో భేటీ అయిన కంగనా.. తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేయడంపై ఫిర్యాదు చేసింది. అలాగే తనపై ఇటీవల శివసేన నేతలు చేస్తున్న కామెంట్లు, అనంతరం జరిగిన పరిణామాలు, ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. కాగా, గవర్నర్‌ను కలిసిన అనంతరం ఇకనైనా తనకు న్యాయం జరుగుతుందని కంగనా అభిప్రాయపడింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనాకు, మహా ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. కాగా, శివసేన బెదిరింపులపై తనకు థ్రెట్ ఉందని కంగనా కేంద్రానికి మొరపెట్టుకోవడంతో ఆమెకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం. ఈ క్రమంలో గతంలో కంగనాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు మహా ప్రభుత్వం సిద్ధమయ్యింది. అయితే ఈ క్రమంలో.. కంగనా రనౌత్ తనకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.

Tags:    

Similar News