కరణ్ ‘పద్మశ్రీ’ వెనక్కి తీసుకోవాలి : కంగనా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఫిల్మ్ మేకర్ ‘కరణ్ జోహార్’ కంటికి కనిపించకుండా పోయాడు. కనీసం సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు పెట్టలేదు. తాజాగా ఇండిపెండెన్స్ డే రోజున మాత్రమే పోస్ట్ పెట్టిన కరణ్.. కనీసం తన సినిమా ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ ప్రమోషన్స్ కూడా చేసుకోలేదు. అయితే కరణ్ ఇంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, తననెప్పుడూ వ్యతిరేకించే కంగనా మాత్రం ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కరణ్ తనను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని […]

Update: 2020-08-18 04:49 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఫిల్మ్ మేకర్ ‘కరణ్ జోహార్’ కంటికి కనిపించకుండా పోయాడు. కనీసం సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు పెట్టలేదు. తాజాగా ఇండిపెండెన్స్ డే రోజున మాత్రమే పోస్ట్ పెట్టిన కరణ్.. కనీసం తన సినిమా ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ ప్రమోషన్స్ కూడా చేసుకోలేదు.

అయితే కరణ్ ఇంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, తననెప్పుడూ వ్యతిరేకించే కంగనా మాత్రం ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కరణ్ తనను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అంతర్జాతీయ వేదికగా హెచ్చరించాడని, బెదిరించాడని కంగనా అండ్ టీమ్ ఆరోపించింది. అంతేకాదు, సుశాంత్ కెరియర్ పతనం అయ్యేందుకు కూడా కరణ్ జోహార్ కారణమని చెప్పింది. ఇలాంటి వ్యక్తికి ‘పద్మశ్రీ’ అవార్డు ఇచ్చిన భారత ప్రభుత్వం.. వెంటనే ఆ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్‌కు ముందు కంగనా టీమ్ మరో ఆరోపణ చేసింది. బాలీవుడ్‌కు చెందిన నిజానిజాలు బయటపడుతున్నామనే ఉద్దేశంతో మూవీ మాఫియా.. మాపై కన్నేసిందని.. త్వరలోనే మా ట్విట్టర్ ఎకౌంట్ సస్పెండ్ అయ్యే చాన్స్ ఉందని చెప్పింది. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ కేసులో న్యాయం జరగాలంటే తప్పకుండా సీబీఐ విచారణ జరగాలన్న సోషల్ మీడియా ఉద్యమంలోనూ ఈ మధ్యే చేరింది కంగనా.

Tags:    

Similar News