కివీస్ కెప్టెన్ కేన్‌విలియమ్‌సన్‌కు గాయం
దిశ, స్పోర్ట్స్: కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ గాయంతో బాధపడటం ఆ జట్టును ఆందోళనలో పెడుతున్నది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో కేన్‌విలియమ్‌సన్ మోచేతికి గాయం అయ్యింది. జూన్ 10 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం విలియ్‌సన్ గాయాన్ని వైద్య బృందం మరోసారి పరిశీలించింది. అయితే అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని కివీస్ జట్టు యాజమాన్యం […]
దిశ, స్పోర్ట్స్: కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ గాయంతో బాధపడటం ఆ జట్టును ఆందోళనలో పెడుతున్నది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో కేన్‌విలియమ్‌సన్ మోచేతికి గాయం అయ్యింది. జూన్ 10 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం విలియ్‌సన్ గాయాన్ని వైద్య బృందం మరోసారి పరిశీలించింది. అయితే అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని కివీస్ జట్టు యాజమాన్యం తెలిపింది. ఇక రెండో టెస్టుకు పేసర్ ట్రెంట్ బౌల్ట్ అందుబాటులో ఉంటాడని న్యూజీలాండ్ కోచ్ గారీ స్టీడ్ తెలిపాడు. తొలి టెస్టు ఆడిన పేసర్లలో ఒకరికి విశ్రాంతిని ఇచ్చి బౌల్డ్‌ను తుది జట్టులోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ చూపుడు వేలికి గాయంతో బాధపడుతున్నట్లు న్యూజీలాండ్ జట్టు యాజమాన్యం తెలిపింది. శాంట్నర్, కేన్‌విలియమ్‌సనప్ తుది జట్టులో ఉంటారా లేదా అనేది మ్యాచ్ ముందు తెలియజేస్తామని కోచ్ గారీ స్టీడ్ తెలిపారు.