కంది ఐఐటీ విద్యార్థుల ప్రతిభ

దిశ, మెదక్: కంది ఐఐటీ విద్యార్థులు కరోనా వైరస్ నిర్ధారించే అత్యాధునిక కిట్‌ను రూపొందించారు. ఈ కిట్‌తో కరోనా టెస్ట్ ఫలితం కేవలం 20 నిమిషాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణకు ఆటీ – పీసీఆర్ ( రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానంలో పరీక్షా ఫలితాల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే. కానీ, ఐఐటీ పరిశోధన బృందం […]

Update: 2020-06-08 09:14 GMT

దిశ, మెదక్: కంది ఐఐటీ విద్యార్థులు కరోనా వైరస్ నిర్ధారించే అత్యాధునిక కిట్‌ను రూపొందించారు. ఈ కిట్‌తో కరోనా టెస్ట్ ఫలితం కేవలం 20 నిమిషాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణకు ఆటీ – పీసీఆర్ ( రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానంలో పరీక్షా ఫలితాల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే. కానీ, ఐఐటీ పరిశోధన బృందం రూపొందించిన కిట్ ద్వారా సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు కూడా తగ్గనుందని చెబుతున్నారు. కేవలం రూ.550 ఖర్చుతోనే కిట్‌ను తయారు చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం తెలిపింది. ఎక్కువ సంఖ్యలో ఈ కిట్లను రూపొందిస్తే రూ.350 కే లభింస్తుందన్నారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి ( ఐసీఎంఆర్ ) నుంచి అనుమతి లభించగా, పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శివ్ గోవింద్ సింగ్, పరిశోధక విద్యార్థులు సూర్యస్నాత త్రిపాఠి, సుప్రజాభట్టా బృందం కలిసి కిట్ ను రూపొందించారు.

Tags:    

Similar News