కరోనా వారియర్స్ కు కమల్ స్వరాంజలి
లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను వివరిస్తూ… స్వయంగా తానే పాట రాసి ఆలపించారు. ప్రజలు పడుతున్న బాధలను వివరిస్తూనే… వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ… వారికి పాటను అంకితం చేశారు. చాలా ఎమోషనల్ గా సాగిన పాటకు జిబ్రాన్ సంగీతం అందించారు. కాగా కమల్ హాసన్ తో పాటు శృతి హాసన్, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచంద్రన్, ఆండ్రియా, శంకర్ మహదేవన్, యువన్ శంకర్ రాజా, […]
లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను వివరిస్తూ… స్వయంగా తానే పాట రాసి ఆలపించారు. ప్రజలు పడుతున్న బాధలను వివరిస్తూనే… వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ… వారికి పాటను అంకితం చేశారు. చాలా ఎమోషనల్ గా సాగిన పాటకు జిబ్రాన్ సంగీతం అందించారు. కాగా కమల్ హాసన్ తో పాటు శృతి హాసన్, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచంద్రన్, ఆండ్రియా, శంకర్ మహదేవన్, యువన్ శంకర్ రాజా, హీరో సిద్ధార్థ్, సిద్ శ్రీరామ్, హరీష్ కళ్యాణ్ తో పాటు పలువురు గాయనీ గాయకులు, సినీ ప్రముఖులు కనిపించారు. తమిళ భాషలో సాగిన లోకనాయకుడి “అరివమ్ అన్బం” పాట కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలి రాగా… ప్రస్తుతం లక్షల వ్యూస్ దాటి ట్రెండింగ్ లో ఉంది.
Launching-Arivum Anbum https://t.co/9NEMTc5R57@RKFI @GhibranOfficial @anirudhofficial @Bombay_Jayashri @thisisysr #Siddharth @sidsriram @Shankar_Live @shrutihaasan @ThisIsDSP @themugenrao @andrea_jeremiah @lydian_official @thinkmusicindia #MaheshNarayanan #ArivumAnbum
— Kamal Haasan (@ikamalhaasan) April 23, 2020
Tags: Kamal Hassan, Shruthi Hassan, DeviSri Prasad, Anirudh Ravichandran, Gibran