ఓటేసిన రజనీకాంత్, కమల్ హాసన్
చెన్నై: తమిళనాడులో పోలింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్, ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మారిస్ పోలింగ్ బూత్‌లో యాక్టర్ రజనీకాంత్ ఓటేశారు. తెయినంపేట్‌లోని చెన్నై హైస్కూల్‌లో ఓటు వేయడానికి కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ సహా విచ్చేశారు. కరుణానిధి, జయలలితల మరణాలతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను రజనీకాంత్, కమల్ […]
చెన్నై: తమిళనాడులో పోలింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్, ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మారిస్ పోలింగ్ బూత్‌లో యాక్టర్ రజనీకాంత్ ఓటేశారు. తెయినంపేట్‌లోని చెన్నై హైస్కూల్‌లో ఓటు వేయడానికి కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ సహా విచ్చేశారు.
కరుణానిధి, జయలలితల మరణాలతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను రజనీకాంత్, కమల్ హాసన్‌లు పూడుస్తారని చాలా భావించారు. రజనీకాంత్ ఆశలు రేపి నీళ్లు జల్లారు. మూడు దశాబ్దాలుగా తన రాజకీయ ఎంట్రీని వాయిదా వేస్తూ చివరికి రాబోవడం లేదని ప్రకటించారు. కాగా, కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి రాజకీయ భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో తేల్చుకుంటున్నారు.