తమిళనాడు సీఎంపై కమల్ హాసన్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల హాసన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో పళనిస్వామి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోందని ఆయన ఆరోపించారు. ఈ వైరస్‌పై పోరుకు గాను ఆయన ‘సేవ్ చెన్నై’ పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘కరోనా వైరస్‌ను నియంత్రించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. అందువల్లే నేనీ ఉద్యమాన్ని మొదలు పెట్టాను’ […]
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల హాసన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో పళనిస్వామి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోందని ఆయన ఆరోపించారు. ఈ వైరస్‌పై పోరుకు గాను ఆయన ‘సేవ్ చెన్నై’ పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘కరోనా వైరస్‌ను నియంత్రించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. అందువల్లే నేనీ ఉద్యమాన్ని మొదలు పెట్టాను’ అని చెప్పిన ఆయన.. కేరళ కన్నా ఈ రాష్ట్రంలో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగ్గా ఉందని, కానీ కోవిడ్-19 కంట్రోల్ లో ‘మిస్ మేనేజ్ మెంట్’ కారణంగా ఇక్కడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ పోరులో ప్రజలను భాగస్వాములను చేయలేకపోతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కమల్ హాసన్ మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలే బాధ్యత వహించి ఈ ప్రభుత్వానికి సాయపడాలని ఆయన కోరారు.