కాంపిటెంట్ అథారిటీ' పీజీ మెడికల్ కోటా భర్తీ
దిశ, న్యూస్‌బ్యూరో: మెడికల్ పోస్టు గ్ర్యాడ్యుయేషన్ కోర్సులో చేరడానికి ‘నీట్’ పరీక్షలో కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ‘కాంపిటెంట్ అథారిటీ’ కోటా కింద దరఖాస్తు చేసుకోడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతో పాటు హైదరాబాద్ నిమ్స్ కళాశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న పీజీ వైద్య సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ పీజీ అర్హత కటాఫ్ స్కోరును […]
దిశ, న్యూస్‌బ్యూరో: మెడికల్ పోస్టు గ్ర్యాడ్యుయేషన్ కోర్సులో చేరడానికి ‘నీట్’ పరీక్షలో కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ‘కాంపిటెంట్ అథారిటీ’ కోటా కింద దరఖాస్తు చేసుకోడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతో పాటు హైదరాబాద్ నిమ్స్ కళాశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న పీజీ వైద్య సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ పీజీ అర్హత కటాఫ్ స్కోరును కేంద్ర ప్రభుత్వమే ఇటీవల తగ్గించింది. ఆ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 19 ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడే సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అనంతరం తుది మెరిట్ జాబితా విడుదలవుతుందని పేర్కొంది.
పీజీ వైద్య ప్రవేశాలకు జనరల్ కేటగిరిలో 275 (30 శాతం) కటాఫ్ మార్కులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 230 (20 శాతం) కటాఫ్ మార్కులు, దివ్యాంగులు (ఓసీ)లకు 252 (25 శాతం) కటాఫ్ మార్కులను తగ్గించినట్లు పేర్కొంది. పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో ఉన్నాయని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.