తొలి విడత కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అంటే..

దిశ, ముషీరాబాద్: ఈ ఏడాది వైద్యవిద్యలో ప్రవేశాలకు గాను నీట్‌లో అర్హత సాధించిన వారిలో తుది గడువు ముగిసే నాటికి 14 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 13న దివ్యాంగ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు మరో వారం రోజులు పడుతుందని, ఈనెల 20 వరకు తొలివిడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలున్నాయని వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీసీ కేటగిరి […]

Update: 2020-11-11 11:57 GMT

దిశ, ముషీరాబాద్: ఈ ఏడాది వైద్యవిద్యలో ప్రవేశాలకు గాను నీట్‌లో అర్హత సాధించిన వారిలో తుది గడువు ముగిసే నాటికి 14 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 13న దివ్యాంగ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు మరో వారం రోజులు పడుతుందని, ఈనెల 20 వరకు తొలివిడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలున్నాయని వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీసీ కేటగిరి సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను దీపావళి తర్వాత విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఎయిమ్స్, జిప్ మార్ ఆల్ ఇండియా కోట (15 శాతం), డీమ్డ్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల తొలి, రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌కు సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మార్పులు చేసింది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు తుది జాబితాను ఈ నెల 7న ప్రకటించగా, సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో నవంబర్ 14 వరకు చేరవచ్చని ప్రకటించింది. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఆ గడువును నవంబర్ 16 వరకు పెంచింది. ఇక రెండో రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ నవంబర్ 18న ప్రారంభం అవుతుందని, సీట్లు కేటాయింపు ఈ నెల 25న ప్రకటించనున్నట్టు తెలిపింది.

Tags:    

Similar News