ఆకట్టుకుంటున్న "కలసిమెలసి బతుకమ్మ" చిత్రం
దిశ, సిద్దిపేట: ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ప్రకృతి పరువం ఫ్లవర్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో మంగళవారం “కలసిమెలసి బతుకమ్మ” చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని రుస్తుం అన్నారు. బతుకమ్మ పండుగ బంగారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, ఆడపడుచుల ఆటపాటలతో సబ్బండ వర్ణాల ఐక్యమత్యాన్ని పెంపొందించి ప్రకృతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రంగు రంగుల పువ్వల్లే కలసిమెలసి బతుకమ్మ, బతుకమ్మ మనబతుకు బతుకమ్మా, మన […]
దిశ, సిద్దిపేట: ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ప్రకృతి పరువం ఫ్లవర్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో మంగళవారం “కలసిమెలసి బతుకమ్మ” చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని రుస్తుం అన్నారు. బతుకమ్మ పండుగ బంగారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, ఆడపడుచుల ఆటపాటలతో సబ్బండ వర్ణాల ఐక్యమత్యాన్ని పెంపొందించి ప్రకృతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రంగు రంగుల పువ్వల్లే కలసిమెలసి బతుకమ్మ, బతుకమ్మ మనబతుకు బతుకమ్మా, మన అస్తిత్వం బతుకమ్మ ఫ్లవర్ ఫెస్టువల్ కరోనా నిబంధనలకు అనుగుణంగా అధిగమించాలని, బాధితుల బాధలు తొలగాలని, ప్రపంచ నలుమూలల శాంతిని, సంతోషాలను, సహజీవనాన్ని, ఐకమత్యాన్ని కోరుకుంటుందని కలర్ ఫుల్ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం అని ప్రఖ్యాత మానవతా చిత్రకారుడు రుస్తుం తెలియజేశారు.