సరిహద్దు క్లోజ్.. ఏపీలోకి నో ఎంట్రీ !

దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా ఈ నిబంధనలు అమలు చేయాలని ఉన్నతాధికారులు తెలిపారు. అంతర్రాష్టాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో, తమ సొంత గ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక పలువురు యువకులు కాలినడకన ఊరికి వెళ్లేందుకు సిద్దమయ్యారు.వివరాల్లోకివెళితే.. సిద్దిపేట నుంచి కాకినాడ వెళ్లేందుకు నాలుగు రోజుల కిందట కాలినడకన బయలుదేరిన 8మంది యువకులను అశ్వారావుపేట వద్ద గల ఏపీ, తెలంగాణ సరిహద్దు […]

Update: 2020-04-11 03:57 GMT

దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా ఈ నిబంధనలు అమలు చేయాలని ఉన్నతాధికారులు తెలిపారు. అంతర్రాష్టాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో, తమ సొంత గ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక పలువురు యువకులు కాలినడకన ఊరికి వెళ్లేందుకు సిద్దమయ్యారు.వివరాల్లోకివెళితే.. సిద్దిపేట నుంచి కాకినాడ వెళ్లేందుకు నాలుగు రోజుల కిందట కాలినడకన బయలుదేరిన 8మంది యువకులను అశ్వారావుపేట వద్ద గల ఏపీ, తెలంగాణ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు నిలిపివేశారు. వీరిని ఏపీ లోకి ప్రవేశించేందుకు అక్కడి ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో అశ్వారావు పేట సీఐ రాజగోపాల్, ఎస్సై మధుప్రసాద్ ఆదేశాల మేరకు వారిని లారీల్లో ఎక్కించి తిరిగి సిద్దిపేటకు పంపించారు.

Tags: carona, lockdown, ap-telangana borders, kakinada people, si madu pradesh

Tags:    

Similar News