కాజు పన్నీర్ మసాలా రెసిపీ
కావాల్సిన పదార్ధాలు: పన్నీర్ -250 గ్రాములు జీడిపప్పు -పావు కప్పు ఉల్లిపాయ తరుగు -ఒక కప్పు పచ్చిమిర్చి -3 పెద్దవి టమాటో పేస్ట్ -సగం కప్పు కొత్తిమీర -అర కప్పు అల్లం వెల్లులి పేస్ట్ -1 టేబుల్ స్పూన్ పెరుగు -2 టేబుల్ స్పూన్స్ నెయ్యి -1 టేబుల్ స్పూన్ నూనె -పావు కప్పు పసుపు – అర టీస్పూన్ జీలకర్ర -1 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్ కారం -1 టేబుల్ […]
కావాల్సిన పదార్ధాలు:
పన్నీర్ -250 గ్రాములు
జీడిపప్పు -పావు కప్పు
ఉల్లిపాయ తరుగు -ఒక కప్పు
పచ్చిమిర్చి -3 పెద్దవి
టమాటో పేస్ట్ -సగం కప్పు
కొత్తిమీర -అర కప్పు
అల్లం వెల్లులి పేస్ట్ -1 టేబుల్ స్పూన్
పెరుగు -2 టేబుల్ స్పూన్స్
నెయ్యి -1 టేబుల్ స్పూన్
నూనె -పావు కప్పు
పసుపు – అర టీస్పూన్
జీలకర్ర -1 టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్
కారం -1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి -1 టీ స్పూన్
గరం మసాలా -అర టీస్పూన్
ఉప్పు -తగినంత
తయారీ విధానం :
ముందుగా నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకుని దానిలో జీలకర్ర వేసి అందులో సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయను వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మసాలాలు బాగా వేగాక టమాటో పేస్ట్ వేసి ఆ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
టమోటోల నుంచి నూనె పైకి రాగానే కొన్ని నీళ్లు పోసి చిక్కబడనివ్వాలి. ఇది చిక్కబడుతుండగా పెరుగు వేసి కూరలో కలిసేదాకా కలుపుకోవాలి. సన్నని మంటపై ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత పన్నీర్ ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపే ముందు కొత్తిమీర తరుగు, నెయ్యి వేసి కలుపుకుని దింపేసుకుంటే వేడి వేడి కాజు పన్నీర్ మసాలా రెసిపీ రెడీ.. ఇది రోటీ, నాన్, బటర్ నాన్‌లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.