కరోనా క్రైసిస్ చారిటీకి కాజల్ విరాళం

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కరోనా పై పోరులో నేను సైతం అంటూ ముందుకొచ్చింది. మగధీర సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ అయినా పంచదార బొమ్మ.. తనకు ఇంత గొప్ప స్టార్ ఇమేజ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని మరిచిపోలేదు. తన సక్సెస్ లో సినీ కార్మికులు కూడా భాగమే అని… కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యత అని … తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నెలకొల్పిన కరోనా […]

Update: 2020-04-16 04:21 GMT

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కరోనా పై పోరులో నేను సైతం అంటూ ముందుకొచ్చింది. మగధీర సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ అయినా పంచదార బొమ్మ.. తనకు ఇంత గొప్ప స్టార్ ఇమేజ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని మరిచిపోలేదు. తన సక్సెస్ లో సినీ కార్మికులు కూడా భాగమే అని… కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యత అని … తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నెలకొల్పిన కరోనా క్రైసిస్ చారిటీ కి రెండు లక్షల విరాళం అందించింది. ఈ విషయాన్ని కాజల్ మేనేజర్ గిరిధర్ వెల్లడించారు. ఇందుకు సంబంధిన డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు.

కాగా సిసిసి కి ఎంతో మంది హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు విరాళాలు లక్షల్లో అందించిన ఇప్పటి వరకు హీరోయిన్లు మాత్రం ఎవరూ విరాళం అందించేందుకు ముందుకు రాలేదు. దీంతో కథానాయికల్లో సహాయం అందించేందుకు తొలుత ముందుకొచ్చిన కాజల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక కథానాయిక ప్రణీత సుభాష్ కూడా కన్నడ ఇండస్ట్రీ కార్మికులను ఆదుకునేందుకు లక్ష విరాళం అందించారు. తద్వారా 50 కుటుంబాలకు భోజనం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

Tags : Kajal Agarwal, Tollywood, CCC, CoronaVirus, Covid 19

Tags:    

Similar News