'ఆచార్య'లో చిరు జోడి చందమామే!

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ కాజల్ అగర్వాల్… కుర్రకారుతోనూ స్టెప్పులేయగలదు… సీనియర్ హీరోల పక్కన మెప్పించగలదు. అటు యంగ్ స్టర్స్.. ఇటు సీనియర్ స్టార్స్‌కు హాట్ ఫేవరేట్ అయిన కాజల్… కొరటాల శివ- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తోంది. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ భామ.. ‘ఆచార్య’లో చిరు హీరోయిన్‌గా కనిపించనున్నానని ప్రకటించింది. ఇంతకు ముందే ‘ఖైదీ నం.150’లో చిరుతో స్టెప్పులేసిన కాజల్ వావ్ అనిపించింది. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ […]

Update: 2020-03-23 01:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ కాజల్ అగర్వాల్… కుర్రకారుతోనూ స్టెప్పులేయగలదు… సీనియర్ హీరోల పక్కన మెప్పించగలదు. అటు యంగ్ స్టర్స్.. ఇటు సీనియర్ స్టార్స్‌కు హాట్ ఫేవరేట్ అయిన కాజల్… కొరటాల శివ- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తోంది. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ భామ.. ‘ఆచార్య’లో చిరు హీరోయిన్‌గా కనిపించనున్నానని ప్రకటించింది. ఇంతకు ముందే ‘ఖైదీ నం.150’లో చిరుతో స్టెప్పులేసిన కాజల్ వావ్ అనిపించింది. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో… చిరు, కాజల్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

అయితే ‘ఆచార్య’ సినిమాలో చిరుకు జోడిగా ముందుగా త్రిషను తీసుకున్నారు. కానీ ఈ సినిమాలో మరో హీరోకు ఛాన్స్ ఉండడంతో… త్రిష పాత్ర నిడివి కాస్త తగ్గింది. దీంతో సినిమాలో తనకు ప్రాధాన్యత లేకుండా పోతుందని.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది త్రిష. దీంతో ఆ చాన్స్ కాస్త కాజల్ కొట్టేసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ వాయిదా పడగా.. త్వరలోనే మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతానని తెలిపింది చందమామ.

Tags:    

Similar News