బాలికలు భవిష్యత్ మీరే తీర్చిదిద్దుకోవాలి
దిశప్రతినిధి, వరంగల్ : విద్య, ఆరోగ్యం, భద్రత విషయంలో బాలికలు అప్రమత్తంగా ఉంటూ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్కడియం కావ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం కోసం మంగళవారం సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలికలకు సామాజికంగా లభించాల్సిన హక్కుల గురించి, విద్యలో వారు సాధించాల్సిన విజయాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండాలని, అందుకోసం తల్లిదండ్రులు కూడా వారికి తగిన రీతిలో పరిజ్ఞానాన్ని అందించాలని […]
దిశప్రతినిధి, వరంగల్ : విద్య, ఆరోగ్యం, భద్రత విషయంలో బాలికలు అప్రమత్తంగా ఉంటూ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్కడియం కావ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం కోసం మంగళవారం సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలికలకు సామాజికంగా లభించాల్సిన హక్కుల గురించి, విద్యలో వారు సాధించాల్సిన విజయాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండాలని, అందుకోసం తల్లిదండ్రులు కూడా వారికి తగిన రీతిలో పరిజ్ఞానాన్ని అందించాలని డాక్టర్కావ్య పేర్కొన్నారు.
ప్రస్తుత అధునాతన సమాజంలో డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా శాస్ర్తీయంగా ముందంజ వేయాలని డాక్టర్కావ్య బాలికలకు చెప్పారు. ఆరోగ్య పరంగా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలనే విషయంపై కూడా బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మెనుస్ట్రువల్ హైజీన్ విషయంలో తల్లి నుంచి బాలికలు తగు సూచనలు తీసుకుని వాటిని అనుసరించాలన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలకు ఎదురవుతున్న అన్ని రకాల సవాళ్లను అధిగమించడానికి ఎవరికి వారే అప్రమత్తంగా ఉండాలని, సవాళ్లను అధిగమించడమే భవిష్యత్‌కు ఉపయోగకారి అని వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలకు నోట్‌బుక్స్, శానిటరీ ప్యాడ్స్పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ కేసిరెడ్డి మాధవి, ప్రధానోపాధ్యాయురాలు సరోజ పాల్గొన్నారు.