బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లోకి సీనియర్ నేత
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నిన్నటివరకు సాగర్ బీజేపీ అభ్యర్థిగా కడారి అంజయ్యయాదవ్ టికెట్ ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాగర్ ఉపఎన్నిక టికెట్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్‌కు దక్కడంతో కడారి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్యయాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీలో అంజయ్యయాదవ్‌కు బలమైన బీసీ నేతగా […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నిన్నటివరకు సాగర్ బీజేపీ అభ్యర్థిగా కడారి అంజయ్యయాదవ్ టికెట్ ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాగర్ ఉపఎన్నిక టికెట్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్‌కు దక్కడంతో కడారి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్యయాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీలో అంజయ్యయాదవ్‌కు బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉంది. 2014 సంవత్సరంలో టీడీపీ తరపున పోటీ చేసి 20వేల పైచిలుకు ఓట్లనే సాధించారు. 2018 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తువల్ల టికెట్ దక్కలేదు.
కానీ అనుహ్యంగా వచ్చిన ఉపఎన్నికలో ఎలాగైనా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలవాలని చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ బీజేపీ అధిష్టానం రవికుమార్ వైపు మొగ్గుచూపడంతో కడారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నాగార్జునసాగర్ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యిందనే చెప్పాలి.