కపిల్ దేవ్‌ను నమ్ముకుని దివాళా తీసిన డైరెక్టర్
దిశ, సినిమా: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరెక్కుతున్న ‘83’ రిలీజ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే కలిసి నటించిన చిత్రానికి కబీర్ సింగ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. కరోనా కారణంగా ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా, జూన్ 4న విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా మందుల కొరతతో ఇబ్బంది […]
దిశ, సినిమా: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరెక్కుతున్న ‘83’ రిలీజ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే కలిసి నటించిన చిత్రానికి కబీర్ సింగ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. కరోనా కారణంగా ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా, జూన్ 4న విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా మందుల కొరతతో ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలంటూ కబీర్ సింగ్ భార్య మినీ మాథుర్.. బాధితుల వివరాలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది.
కాగా, ఓ నెటిజన్ ఈ పోస్టుపై కబీర్ వైఫ్‌ను ట్రోల్ చేశాడు. ‘83 మూవీపై పెట్టుబడి పెట్టిన మీ భర్త పూర్తిగా దివాళా తీశాడట కదా.. ఇది నిజమేనా?’ అంటూ ఆమెను ప్రశ్నించాడు. దీనికి చాలా కూల్‌గా సమాధానమిచ్చిన మాథుర్.. ‘దయచేసి మీ అదనపు సమయాన్ని బాధలో ఉన్న వారికి సాయపడేందుకు ఉపయోగించండి’ అని రిప్లయ్ ఇచ్చింది. ఇక ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు అలాంటి కామెంట్స్‌ను పట్టించుకోవద్దని మాథుర్‌కు సూచించారు.