రైతు సమస్యలపై ప్లకార్డులతో నిరసన

దిశ, నల్లగొండ: రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. భువనగిరి మండలంలోని నందనం, నమాత్‌పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈనేపథ్యంలో రైతు సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. తూకాల్లో జరుగుతున్న అవకతవకలు, మోసాలను అరికట్టాలన్నారు. ప్రతి కేంద్రం నుంచి రోజుకు ఐదు లారీల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ఏ గ్రేడు ధాన్యం […]

Update: 2020-04-27 02:28 GMT

దిశ, నల్లగొండ: రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. భువనగిరి మండలంలోని నందనం, నమాత్‌పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈనేపథ్యంలో రైతు సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. తూకాల్లో జరుగుతున్న అవకతవకలు, మోసాలను అరికట్టాలన్నారు. ప్రతి కేంద్రం నుంచి రోజుకు ఐదు లారీల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ఏ గ్రేడు ధాన్యం కొనుగోలు చేసి బి గ్రేడ్‌గా మారుస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా రైతుకు క్వింటాకు రూ.750 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: farmer issues, Kondamadugu Narsimha, CPM, Placards, nallagonda

Tags:    

Similar News