ఇళ్ల స్థలాల సేకరణలో భారీ స్కాం: జీవీ ఆంజేనేయులు

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ స్కాంకు తెరతీశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజేనేయులు ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కోసం భూ సేకరణకు నడుం బిగించిన సంగతి తెలిసిందే అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బ్రహ్మనాయుడు 100 ఎకరాలు ప్రభుత్వానికి విక్రయించారని ఆరోపించారు. ఎకరం 4 లక్షల రూపాయల విలువ చేసే భూమిని 18 లక్షల రూపాయలుకు విక్రయించారని అన్నారు. నాలుగు కోట్ల రూపాయల […]

Update: 2020-03-24 06:17 GMT

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ స్కాంకు తెరతీశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజేనేయులు ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కోసం భూ సేకరణకు నడుం బిగించిన సంగతి తెలిసిందే అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బ్రహ్మనాయుడు 100 ఎకరాలు ప్రభుత్వానికి విక్రయించారని ఆరోపించారు. ఎకరం 4 లక్షల రూపాయల విలువ చేసే భూమిని 18 లక్షల రూపాయలుకు విక్రయించారని అన్నారు. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి 18 కోట్ల రూపాయలకు విక్రయించారని, తద్వారా ఆయన 14 కోట్ల రూపాయలు స్కాంకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే దోపిడీకి ప్రభుత్వాధికారులు కూడా సహకరించారని ఆయన విమర్శించారు. ఈ స్కాంపై ప్రభుత్వం విచారణ జరపాలని, ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: guntur, tdp, gv anjaneyulu, vinukonda, government houses scheme, 14 crore schame

Tags:    

Similar News