టీమ్ ఇండియా చాలా క్రమశిక్షణగా ఉన్నది : జస్టిన్ లాంగర్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా చాలా క్రమశిక్షణ కలిగిన జట్టని. తొలి రెండు టెస్టుల్లో వాళ్ల ప్రవర్తన చూస్తే వారి క్రమశిక్షణ ఎంత స్థాయిలో ఉందో అర్ధం చేసుకున్నానని ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించారు. ”అడిలైడ్ టెస్టులో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు ఆ తర్వాత వెంటనే పుంజుకొని రెండో టెస్టు గెలిచింది. వాళ్లు నిజంగా కష్టపడి ఆడారు. వాళ్ల క్రమశిక్షణ నాకు నచ్చింది. తర్వాత టెస్టులో మరింత ఘోరంగా […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా చాలా క్రమశిక్షణ కలిగిన జట్టని. తొలి రెండు టెస్టుల్లో వాళ్ల ప్రవర్తన చూస్తే వారి క్రమశిక్షణ ఎంత స్థాయిలో ఉందో అర్ధం చేసుకున్నానని ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించారు. ”అడిలైడ్ టెస్టులో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు ఆ తర్వాత వెంటనే పుంజుకొని రెండో టెస్టు గెలిచింది. వాళ్లు నిజంగా కష్టపడి ఆడారు. వాళ్ల క్రమశిక్షణ నాకు నచ్చింది. తర్వాత టెస్టులో మరింత ఘోరంగా ఓడిపోతారని భావించాను కానీ.. అలా జరగలేదు అందుకే ఈ మాటలు చెబుతున్నాను” అని ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ వ్యాఖ్యానించాడు. మూడో టెస్టులో టీమ్ ఇండియాను ఓడించాలంటే మరిన్ని ప్రత్యేక వ్యూహాలు రచించాలని.. ఇందుకోసం ఆస్ట్రేలియా సన్నద్దంగా ఉందని ఆయన చెప్పారు.