న్యాయశాఖ కార్యదర్శి నారాయణ రాజు మృతి బాధాకరం
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జి.నారాయణ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ ఉన్నతాధికారిగా ఉన్న నారాయణ రాజు తెలంగాణ రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఉండేవారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జి.నారాయణ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ ఉన్నతాధికారిగా ఉన్న నారాయణ రాజు తెలంగాణ రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఉండేవారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చేవారని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాలను కేంద్రానికి వినిపించిన వ్యక్తి నారాయణరాజు అని పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాజ్యసభ చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో తనతోపాటు రాజ్యసభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత కే. కేశవరావు సమావేశమైన సందర్భంగా నారాయణ రాజు క్రియాశీలక పాత్రను పోషించారని, కేంద్ర న్యాయ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారని వివరించారు. నారాయణ రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.