జస్టిస్ ఫర్ చైత్ర.. ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిరసన
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: చైత్రను అత్యాచారం చేసిన మృగాడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ ఎక్స్‌రోడ్డులో సాగర్ రహదారిపై స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన చేశారు. కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. సాగర్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వనస్థలిపురం పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చైత్ర నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసే వరకు ఆందోళన విరమించబోమంటూ స్థానికులు బైఠాయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. […]
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: చైత్రను అత్యాచారం చేసిన మృగాడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ ఎక్స్‌రోడ్డులో సాగర్ రహదారిపై స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన చేశారు. కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. సాగర్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వనస్థలిపురం పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చైత్ర నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసే వరకు ఆందోళన విరమించబోమంటూ స్థానికులు బైఠాయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాట్రావత్ రమేష్ మాట్లాడుతూ గిరిజన అమ్మాయి అయినందునే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అగ్రకులాలకు ఒక న్యాయం, ఎస్సీ, ఎస్టీలకు మరొక న్యాయమా? అంటూ మండిపడ్డారు.