ఆ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

దిశప్రతినిది, మహబూబ్ నగర్: జూరాల పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరిగింది. ఫలితంగా 11 గేట్ల ద్వారా 1,08,588 క్యూసెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే జూరాలకు ఎగువ ప్రాంతం నుండి 95 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ లు ఉండగా ప్రస్తుతం 8.949 టీఎంసీలు ఉన్నాయి. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 318.516 […]

Update: 2020-07-16 21:51 GMT

దిశప్రతినిది, మహబూబ్ నగర్: జూరాల పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరిగింది. ఫలితంగా 11 గేట్ల ద్వారా 1,08,588 క్యూసెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే జూరాలకు ఎగువ ప్రాంతం నుండి 95 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ లు ఉండగా ప్రస్తుతం 8.949 టీఎంసీలు ఉన్నాయి. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 318.516 మీ. కాగా ప్రస్తుత 318.170 మీ.ల నీటి మట్టం ఉంది. ఎగువ విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్ల విద్యుత్ ను అధికారులు ఉత్పత్తి చేస్తున్నారు.

Tags:    

Similar News