KTR : కేటీఆర్ వార్నింగ్.. జూడాల స్ట్రాంగ్ రిప్లై.. అత్యవసర సేవలు కూడా బంద్!
దిశ, వెబ్‌డెస్క్ : తమ న్యాయపరమైన డిమాండ్లను నేరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బుధవారం ఉదయం జూడాలు అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు) మినహాయించి విధులు బహిష్కరించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెంచిన స్టైఫండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూడాలు సమ్మెకు దిగడంపై మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : తమ న్యాయపరమైన డిమాండ్లను నేరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బుధవారం ఉదయం జూడాలు అత్యవసర సేవలు (ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు) మినహాయించి విధులు బహిష్కరించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెంచిన స్టైఫండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని కోరారు.
అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూడాలు సమ్మెకు దిగడంపై మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించగా.. ఈ సమయంలో సమ్మె సరైనది కాదని, విరమించకపోతే జూడాలపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి బెదిరింపులకు దిగుతున్న మంత్రిపై జూడాలు అసహనం వ్యక్తంచేశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని జూడాలు స్పష్టం చేశారు. లేనియెడల రేపటి నుంచి కొవిడ్-19, అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.